వెన్న తో పెట్టిన విద్యలా
నట్టింటిలో రంగవల్లి లా
అరవిరిసిన మొగ్గలా
సున్నితంగా
సుతారంగా
వీనులవిందుగా
హ్రిదయ అలజడులలో
అమ్మా అనే మధుర సంబోధనలా
భాష తో ఏర్పడ్డ భంధవ్యం
కన్న తల్లి లాలింపు వలె
ఎన్నటికి వీడని నేస్తం వలె
నా అంతరంగాలలో వెలువడే ఆలోచనలను
అక్షర రూపంలో ప్రతిద్వానించి
మాత్రు ప్రేమలో మాధుర్యం లా
తేటగా, లాలి పాటగా
తెలుగు పదజాల మాల
నా అభిప్రాయాల వేదికని
అలంకరించాలనే
తపన!
yes. attractive thoughts :)
ReplyDelete